వర్షం వచ్చేముందు
మేఘాలు నల్లగా ఉంటాయి ఎందుకు?, Clouds are Black before raining Why?
ప్ర : వర్షం వచ్చేముందు
మేఘాలు నల్లగా ఉంటాయి ఎందుకు?,
జవాబు1 : వర్షం వచ్చే ముందు నల్లని మెఘాలు కమ్ముకుంటాయి
. అంతకు ముందు అవి నీలం , తెలుపు రంగుల్లో ఉంతాయి
.ఆ నల్లని మేఘాలను శాస్త్రపరిభాషలో " కుమ్యులో నింబస్ " మేఘాలలు అంటారు
. ఆ మేఘాలలొ దట్టంగా పేరుకున్న నీటి బిందువులు , మంచు అందుకు కారణము ,. ఆ దట్టమైన పొరవలన ఆ మేఘాలలో నుండి కాంతి కి్రణాలు
ప్రయాణం చేయలేవు . ఫలితంగా మనకు నల్లగా కనిపిస్తాయి . ధూళిరేణువులు , కాలుష్యకారకాల వల్ల కుడా నల్లరంగు వస్తుంది .
జవాబు 2: ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకునే ముందు ఒక వస్తువుపై
కాంతి కిరణాలు పడినపుడు ఏమవుతుందోననే విషయాన్ని చూద్దాం. ఏదైనా వస్తువుపై కాంతికిరణాలు
పడినపుడు కాంతిలోని కొంతభాగం వెనుదిరిగి వస్తుంది. దీన్ని పరావర్తనం అంటారు. కాంతిలోని
కొంత భాగాన్ని వస్తువు శోషిస్తుంది. కొంత భాగం వస్తువులోంచి పయనించి అవతలవైపు నుంచి
బయటకు వస్తుంది. అద్దం లాంటి తళతళమెరిసే వస్తువుపై కాంతి పడినపుడు, అందులోని ఎక్కువ శాతం పరావర్తనం చెందుతుంది. నల్లగా
ఉండే వస్తువుపై కాంతిపడితే ఎక్కువ కాంతిని అదిశోషిస్తుంది. గాజు లాంటి పారదర్శక పదార్థంపై
కాంతి పడితే, చాలా వరకు కాంతి అందులో
నుంచి బయటకు వస్తుంది.
ఇపుడు మన ప్రశ్న విషయానికి
వస్తే, సూర్యరశ్మికి భూమిపై
ఉండే నీరు ఆవిరి అవడం వల్ల మేఘాలు ఏర్పడతాయని మనందరికీ తెలుసు. తక్కువ స్థలంలో ఎక్కువ
నీటి బిందువులు గుమికూడి ఉన్న మేఘం ఎక్కువ కాంతిని శోషించుకుంటుంది. అందుకే ఆ మేఘం
నల్లగా కనిపిస్తుంది. ఎక్కువ నీటి బిందువులు ఉన్న ఆ మేఘం త్వరగా వర్షిస్తుంది. కొన్ని
నీటి బిందువులు, చాలా వరకు చిన్న మంచు
స్ఫటికాలు ఉండే మేఘంపై పడే కాంతి చాలా వరకు పరావర్తనం చెందడం వల్ల అది తెల్లగా కనిపిస్తుంది.
ఈ మేఘాల్లోనే పారదర్శకమైన మంచు స్ఫటికాలు ఉంటే వాటి గుండా కాంతి కిరణాలు చొచ్చుకుపోయి
ఆ మేఘాలు పారదర్శకంగా కనిపిస్తాయి.
No comments:
Post a Comment